PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సబ్సిడీ విత్తనాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి

1 min read

– మట్లి గ్రామ సర్పంచ్ సోమరాపు నాగార్జునాచారి
పల్లెవెలుగువెబ్​, రాయచోటి/వీరబల్లి: ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పంపిణీ చేస్తున్న రబీ సాగుకు అవసరమయ్యే వేరుశెనగ విత్తనాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని మట్లిగ్రామ సర్పంచ్ సోమరాపు నాగార్జునాచారి పేర్కొన్నారు.రైతు భరోసా కేంద్ర సిబ్బంది నవీన్ కుమార్ రెడ్డి,మంజుషా ,గ్రామ నాయకులతో కలిసి సర్పంచ్ సోమరాపు నాగార్జునాచారి చేతులమీదుగా మంగళవారం రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో విపరీతమైన వర్షాలతో వేరుశెనగ పంటతో పాటు ఇతర పంటలు కూడా అంతంత మాత్రంగానే దిగుబడులు వచ్చాయన్నారు.రబి సీజన్ కు సంబంధించి మట్లి గ్రామానికి 110 బస్తాలు తెల్లగాయలు రాగా వాటిని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అన్నదాతలకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రమణయ్య,కేశవులు,చలపతి,స్వామికొండలు, వెంకటరమణమరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author