PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కమర్షియల్ హీరోగా సక్సెస్​ అవుతా..

1 min read

సినిమా డెస్క్​ : రెండేళ్ల క్రితం‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. వీటిలో ముందుగా ‘ఎస్ఆర్ కళ్యాణ్ మండపం’ చిత్రం ఆగస్టు 6న విడుదలవుతోంది. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా కిరణ్ తన గురించి, తన కెరీర్ గురించి మాట్లాడాడు. మా సొంతూరు కడప జిల్లా రాయచోటి. బెంగలూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత అన్నీ సాఫ్ట్ క్యారెక్టర్సే వచ్చాయి.

కానీ నాకు మాత్రం మాస్, కమర్షియల్, ఎంటర్ టైనింగ్ సినిమాలు చేయడమే ఇష్టం. దానికోసమే ఈ సినిమాకి నేనే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశా. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. వీటితోపాటు సెబాస్టియన్​, సమ్మతమే, మరో సినిమా … అన్నీ ఈ ఏడాదే విడుదలవుతాయి. ఎప్పటికైనా కమర్షియల్ సినిమాలే నంబర్ వన్ ప్లేస్ లో ఉంటాయని నమ్ముతాను. ఓ కమర్షియల్ హీరోగా సక్సెస్ అవ్వాలన్నదేనా లక్ష్యం అంటున్నాడు కిరణ్ అబ్బవరం.

About Author