NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌క్సెస్ నిర్వచనం చెప్పిన ప్ర‌పంచ కుబేరుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వార‌న్ బ‌ఫెట్.. ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో ఒక‌రు. అతి సామాన్య స్థాయి నుంచి కుబేరుడిగా ఎదిగిన వ్య‌క్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే త‌త్వం ఆయ‌న‌ది. ఇటీవ‌ల అమెరికాలోని ఒమాహాలో నిర్వ‌హించిన బ‌ర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట‌ర్ల వార్షిక స‌మావేశంలో స‌క్సెస్ నిర్వచనం చెప్పారు. సక్సెక్‌కు నిర్వచనం ఇవ్వాలంటే జీవితాన్ని చూడాలి. మీరు నా వయసుకు వచ్చినప్పుడు (91) జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సక్సెస్‌ అనేది బ్యాంక్‌ బ్యాలెన్స్‌, మన పరపతిలలో ఉండదు. మనల్ని ఎంత మంది ప్రేమించాలని మనం కోరుకుంటాం.. వాస్తవంలో మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు ఎందురు ఉన్నారనేది సక్సెస్‌కి అసలైన నిర్వచనం అని బఫెట్‌ అన్నారు. విచిత్రం ఏంటంటే ప్రేమను మనం డబ్బుతో కొనలేం. బిలియన్‌ డాలర్ల డబ్బు ఉంది కదా భారీ ఎత్తున ప్రేమను పొందగలం అనుకోవడం పొరపాటు. అది అసాధ్యం కూడా. కేవలం మనం ఇతరుల్ని ప్రేమించినప్పుడే.. ఆ ప్రేమ మనకు తిరిగి వస్తుంది అంటూ జీవిత సారాన్ని కాచి వడబోసిన విషయాలను వారెన్‌ బఫెట్‌ నేటి తరానికి వివరించారు. అసలైన ప్రేమను పొందడమే జీవితంలో సక్సెస్‌కు నిజమైన కొలమానం అని బ‌ఫెట్ అన్నారు.

                                            

About Author