PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టుదలగా సాధిస్తే విజయం మీదే

1 min read

విజయానికి తొలిమెట్టు పదో తరగతి పరీక్షలు

విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి

ఎల్ఐసి ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్టు పంపిణీ

ఆత్మకూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పదవ తరగతి పరీక్షలు విజయానికి తొలిమెట్టు అంటూ ఆత్మకూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్ విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు. శనివారం మండల పరిధిలో గల వడ్డేమాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఎల్ఐసి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు కిట్టు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ రామచంద్రుడు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ శెట్టి పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జుబేదా సభాధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్ మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధం కావాలంటే సామాగ్రి డాలు, కత్తి ఎంత అవసరమో అంతే విధంగా పరీక్షకు పెన్ను రైటింగ్ పాడ్  అవసరమన్నారు. దేశంలో మొట్టమొదటి ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపికైన కిరణ్ బేడిని ఆదర్శంగా తీసుకోవాలని అంతేగాక శాస్త్రవేత్త ,రాష్ట్రపతిగా సేవలందించిన అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది అన్నారు. తల్లిదండ్రులు గురువులు దైవంతో సమానమని వారి మాట తప్పక వినాలని గురువులు మన మంచి కోరే వారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు బాధ్యత తీసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టుదల సాధిస్తే విజయం మీ సొంతం అవుతుందని కష్టపడి ఇష్టపడి విజయం సాధించాలని తెలిపారు. ముఖ్యంగా సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఏ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు పెద్దపెద్ద హోదాల్లో పని చేస్తున్నారని విద్యార్థులకు గుర్తు చేశారు. పేద పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎల్ఐసి వారికి పాఠశాల ఉపాధ్యాయుడు శివకోటిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ రామచంద్రుడు ,ఆత్మకూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ శెట్టి, ఎల్ఐసి జోనల్ క్లబ్ నెంబర్, ఎల్ఐసి లియాపీ ప్రెసిడెంట్ సగినేల స్వామి దాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జుబేదా కి పూలమాలవేసి దుష్యాలువతో సన్మానించారు. విద్యార్థిని విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరైజర్ తదితర వాటితో కూడిన కిట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సగినేల సత్యాలు , నవనంది పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సగినేల సుబ్బన్న పాఠశాల ఉపాధ్యాయులు నాగ సుశీల ,హబీబుల్లా ,శివమ్మ, ప్రసాద్, నౌమన్ హుస్సేన్ వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి దేవి మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author