అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి పరీక్షలు సక్సెస్
1 min readపల్లెవెలుగువెబ్ : అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఈ పరీక్షను నిర్వహించారు. దీనికి అత్యాధునిక సాంకేతికతను జోడించారు. మిసైల్ సామర్థ్యం రుజువైంది. భారత్, రష్యా కలిసి ఈ క్షపణిని తయారు చేశాయి. భారత దేశానికి డీఆర్‌డీవో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ఇటీవలే భారత నావికా దళంలో చేర్చారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలను ఊటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలు తెలిపింది.