విజయవంతంగా 15 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు
1 min read
ఆంధ్ర హాస్పిటిల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండె చికిత్సలు
విజయవాడ, న్యూస్ నేడు : నవ్యంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ఇన్నిపిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయటానికి ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పిడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల, పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి చేయటం వలన సాధ్యపడిందని చీఫ్ అఫ్ చిల్డ్రన్ సర్వీసెస్, డైరెక్టర్ డాక్టర్ పి.వీ. రామారావు స్పష్టంచేశారు.శుక్రవారం ఆంధ్ర హాస్పిటల్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో 34వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు జరిగిందన్నారు. డాక్టర్ బి. ఆర్. జగన్నాథ్ పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, శ్రీ మధుసూదన్ సాయి హాస్పిటల్, ముద్దెనహల్లి, బెంగళూరు, ఉష శెట్టి, అశ్విని కుమారస్వామి, బెంగళూరు నుంచి ఇక్కడకు వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టెర్ నాగేశ్వర రావు, కార్డియాక్ సర్జన్ తో కలిసి, ఆంధ్ర హాస్పిటల్స్ లో 15 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించామన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు టెట్రాలజీ అఫ్ ఫాలో, డి వా ఆర్ వి.పి ఏ బాండింగ్ మరియు ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించతం జరిగిందన్నారు.గత పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ముఫైనాలుగు సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేసారని, మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషనులు ప్రతి రెండు, మూడు నెలలకొకసారి ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి చేయనున్నారని వ్యక్తపరిచారు. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామన్నారు.ఇప్పటి వరకు 4500 ఆపరేషన్లు పైన,ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేయటం జరిగిందని వెల్లడించారు.ఆంధ్ర హాస్పిటల్స్ లో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కార్డియాక్ టీమ్, కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీం సహకారంతో ప్రతి రోజు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేసారు. పిల్లల గుండె జబ్బులు వున్న వారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మన హాస్పిటల్ కు వస్తున్నారని తెలిపారు. ఈ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర హాస్పటిల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె. డాక్టర్లు, సర్పులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ క్యాంపు ని ఆంధ్ర మధర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్, ఎన్ టి ఆర్ వైద్య సేవ సహకారంతో నిర్వహించామన్నారు.ఈ సమావేశం లో డాక్టర్లు విక్రమ్, పిల్లల కార్డియాలజిస్ట్, నాగేశ్వర రావు, కార్డియాక్ సర్జన్, రమేష్, కార్డియాక్ ఎన్ స్టిటిస్ట్, రఘు రామ్, కార్డియాలజిస్ట్, తిరుమల రావు, కార్డియాలజిస్ట్, ఉమాశంకర్ పిల్లల కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ తదితరులు పాల్గొన్నారు.
