PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కామినేని హాస్పిటల్ లో “ఎం ఐ సి ఎస్ “సర్జరీలు విజయవంతం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: స్థానిక కామినేని హాస్పిటల్ లో సంక్లిష్ట హృద్రోగ పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు రోగులకు రెండు అరుదైన ఎంఐ సిఎస్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసామని కామినేని హాస్పిటల్స్ సర్జన్లు వెల్లడించారు. స్థానిక కామినేని హాస్పిటల్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కామినేని సి ఓ ఓ డాక్టర్ నవీన్ మాట్లాడుతూ.రోగులు ఇప్పుడు ఆరోగ్యంతో పూర్తి స్థాయిలో కోలుకున్నారని చెప్పారు.ఇలాంటి సంక్లిష్ట సర్జరీలు అత్యంత కచ్చితత్వంతో చేయగలిగిన అత్యంత నైపుణ్యాలు కలిగిన బృందాన్ని కలిగిఉండడం తమకు గర్వకారణమని కామినేని సీఓఓ డాక్టర్ నవీన్ తెలిపారు.ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటైన కామినేని హాస్పిటల్స్ వైద్యులు ఇద్దరు రోగులకు అరుదైన ఎంఐ సిఎస్ సర్జరీలను విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగాఆసుపత్రి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ కాంటే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన కురిచేటి లక్ష్మీ నాగ వేంకటేశ్వరరావు కు మినిమల్లీ ఇన్వేసివ్ ఆఫ్ పంప్ సీఏబీజీ సర్జరీ చేశామని, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ జిల్లా పెనమలూరుకు చెందిన కేతరాజు అరుణారావు కు ఎంవిఆర్ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ చేశామని ఈ రెండు సర్జరీలు కూడా విజయవంతంగా జరిగాయని వెల్లడించారు. రోగులు ఇప్పుడు పూర్తి స్థాయిలోకోలుకున్నారని అన్నారు. రెండు ఎంఐసిఎస్ సర్జరీలు విజయ వంతంగా పూర్తి చేశామని, హాస్పిటల్ లోని వైద్యుల బృందం బాగా శిక్షణ పొందిందని, ఇలాంటి సంక్లిష్ట సర్జరీలు చేయడంలో బాగా అనుభవం కలిగి ఉందని అన్నారు.కామినేని హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ కుమార్ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author