విజయవంతంగా మనభూమి – నా దేశం..
1 min read– విద్యార్థి దశ నుంచే దేశం కోసం, భూమికోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యనభ్యసించాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఆజాదికా అమృత మహోత్సవవ్ లో భాగంగా దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ వన మహోత్సవం. మన భూమి – నా దేశం లో భాగంగా అమరవీరులను స్మరించుకుంటూ శిలాఫలకాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఆవిష్కరించారు, అమరవీరుల పేర్లను కూడా ఆ శిలాఫలకంపై పొందుపరిచారు. ఈ సందర్భంగా సైదు భాగ్యలక్ష్మి వజ్రం మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేశ సమైక్యత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పిటిసి ముంగర సరస్వతి కొండలరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థిని విద్యార్థులు విద్యనభ్యసిస్తూనే దేశం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను మరువకుండా, మన భూమిని సాటి మనిషిని ప్రేమించే తత్వం, పుడమి తల్లిని కాపాడుకునే అలవాటు అలవర్చుకొని ఎదగాలన్నారు. మనభూమి – నా దేశం కార్యక్రమాలలో కార్యదర్శి వై సుమలత, సచివాలయ సిబ్బంది, హై స్కూల్ హెచ్ఎం మీనా, వి ఏవో సుబ్రహ్మణ్యం, వార్డు మెంబర్లు, అధికారులు , ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు స్థానిక పౌరులు ప్రతిజ్ఞ చేశారు.