కర్నూలు జీజీహెచ్ ఓపి కౌంటర్ ..క్యాజువాలిటీ విభాగాల ఆకస్మిక తనిఖీ
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓపి కౌంటర్ మరియు క్యాజువాలిటీ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని ఈ డిజిటల్ ఓపి కౌంటర్ మరియు ఇతర ఓపి కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది పనితీరును మెరుగు పరిచేందుకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.ఆసుపత్రి ఆవరణలోని ఓపి కోసం పేషెంట్స్ రద్దీ దృష్ట్యా ఈ డిజిటల్ ఒపి కౌంటర్ మరియు ఇతర కౌంటర్లను తత్వరితంగా ఓపి ఇచ్చే విధంగా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ డిజిటల్ కౌంటర్ కు మంచి స్పందన వచ్చి బాగా ఉపయోగపడుతుందని ఇంకొక e- డిజిటల్ కౌంటర్ కూడా రేపు ప్రారంభించాలి అని ఆదేశించారు.. తొందరగా ఓపికి ఇచ్చేకి వీలుగా ఫార్మసీ విద్యార్థులను కూడా ఉపయోగించుకోవడం చాలా బాగా సక్సెస్ అయింది.ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఓపి ఇవ్వడం వలన వారికి త్వరగా ట్రీట్మెంట్ అందుతుందని తెలియజేశారు. త్వరిత గతిని ఓపి ఇవ్వడం వలన వాళ్ళు తిరిగి ఓపికి వెళ్లి అక్కడ వైద్యులతో చూపించుకొని మరల పరీక్షలకు వెళ్లడానికి సమయం దొరుకుతుంది కావున 8.30 AM నుంచే ఓపి ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించి అనంతరం అక్కడ ఉన్న పేషంట్ల గురించి ఆరా తీశారు. పేషెంట్లకు కావాల్సిన సదుపాయాలు మరియు అత్యవసర మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా అని CMO ద్వారా ఆరా తీశారు.క్యాజువాలిటీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని సిఎంఓకి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ సెక్షన్ మిషన్లు తక్కువగా ఉండడం గమనించి త్వరితగతిని వారికి రెండు సక్షన్ మిషన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ మరియు ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, డా.శివబాల నగాంజన్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, డా.శ్వేత, ఆసుపత్రి ఏడి, శ్రీ.రమేష్ బాబు మరియు నర్సింగ్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి ప్రభాకర రెడ్డి, తెలిపారు.