PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందివర్గం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

1 min read

– నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంల ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు నందివర్గం పోలీస్స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్లమర్యాదగానడుచుకోవాలని ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని పరిష్కరించిన వాటిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు.నాటుసారా, అక్రమ మద్యం, PDS రైస్,ఇసుక అక్రమ రవాణా, అరికట్టాలని ఆదేశించారు. క్రైమ్ అగెనెస్ట్ ఉమన్ కేసులకు సంబంధించి ఏమైనా పిర్యాదులు వచ్చిన యెడల సత్వరమే స్పందించాలని ,మహిళల అదృశ్యం కేసులు పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ త్వరగా కనుగొని సంబంధించిన వారికి అప్పగించాలని ఆదేశించారు.మహిళల భద్రత కు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్డ్ యూజర్ గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించి సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని త్వరగా డిస్పోజల్ చేయాలనిఆదేశించారు.సైబర్ నేరాలు ప్రస్తుత కాలంలో విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

About Author