PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయాల ఆకస్మిక తనిఖీ.. జిల్లా కలెక్టర్​

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : గ్రామ సచివాలయ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ ఈరోజు కల్లూరు మండలం బస్తిపాడు , చిన్నటేకూరు గ్రామాల సచివాలయాలను ఆఖస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను గ్రామస్తులకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరినారు.బస్తి పాడు గ్రామ సచివాలయం ఎడ్యుకేషన్ సెక్రెటరీ నుండి ఎంతమంది డ్రాప్స్ ఔట్స్ ఉన్నారు అన్న విషయము అడుగగా 10 మందిని తిరిగి స్కూల్లో చేర్పించడం జరిగిందని తెలుసుకున్నారు. నాడు నేడు పనుల గురించి వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గురించిన వివరాలు ఏ విధంగా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా మూడు అదనపు క్లాస్ రూముల పనులు జరుగుతున్న విషయం తెలుసుకున్నారు.అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఈ కేవైసీ ఎంతవరకు వచ్చిందని , ఆర్బికేల గురించి ఎన్ని ఖాతాలు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని క్లోజ్ ఎన్ని అయిపోయాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు.హెల్త్ అసిస్టెంట్ ద్వారా ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు అని అడగగా 37 మంది తన పరిధిలో ఉన్నట్టు 86 మంది అంగన్వాడి విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు .గర్భిణీ స్త్రీల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలు గురించి కలెక్టర్ వివరంగా అడిగి తెలుసుకున్నారు.చిన్నటేకూరు గ్రామ సచివాలయ సిబ్బంది లో అగ్రికల్చర్ సెక్రటరీ ద్వారా 173 ఈకేవైసీలు పెండింగ్లో ఉన్న విషయము అడిగి తెలుసుకున్నారు .1266 ఎకరాలు పంటలు పండే పొలం ఉన్నట్టుగా 1057 ఖాతాలు ఉన్నట్టుగా సమాచారాన్ని రాబట్టారు.ఎడ్యుకేషన్ సెక్రటరీ ద్వారా మధ్యాహ్న భోజన పథకం , స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు , టాయ్లెట్ ఇన్స్పెక్షన్లు మొదలగు విషయాల గురించి సమాచారం తెలుసుకున్నారు.

About Author