గురుకుల పాఠశాల ఆకస్మిక తనఖీ..
1 min read– సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె వేణుగోపాల్
పల్లెవెలుగు, వెబ్ గొనేగండ్ల : సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె వేణుగోపాల్ మరియు కమ్యూనిటీ మోబలైజేషన్ అధికారులు మండల కేంద్రమైన గొనేగండ్లలోని కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పదవ తరగతి విద్యార్థుల స్థాయిని ఆయన పరిశీలించారు.ఎస్ ఓ మరియు ఉపాధ్యాయుని లతో సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులనుద్దేశించి, విద్యార్థులు ప్రమాణాలను పెంపొందించే విధంగా తగిన చర్యలు మరియు బోధన ఉండాలని, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.అనంతరం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం మరియు భవిత కేంద్రాలను సందర్శించారు.ఇందులో భాగంగా టి ఎ ఆర్ ఎల్ శిక్షణ కార్యక్రమములో పాల్గొని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు మరియు గణితము బోధనలో మెలకువలు మరియు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలలో అమలు గురించి, ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించారు.అలాగే జగనన్న విద్యా కానుకకు సంబంధించి బయోమెట్రిక్ అతేంటిఫికేషన్ ను వంద శాతం పూర్తి చేయాలని, మిగిలిన కిట్ లను వెంటనే తిరిగి పంపాలని ఎమ్ ఆర్ సి సిబ్బందిని ఆదేశించారు.