NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ…

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు.శనివారం నందికొట్కూరు మండలం బిజినవేముల, నందికొట్కూరు మున్సిపాలిటీ లోని రెండవ  సచివాలయంను  జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, జీ ఈ ఆర్ సర్వే మరియు ఇంటింటికీ ఓటర్ సర్వే పనితీరును అడిగి తెలుసుకున్నారు. జీ ఈ ఆర్  సర్వేలో  వంద శాతం పురోభివృద్ధి సాధించిన బిజినవేముల వాలంటరీలను వెల్పేర్ అసిస్టెంట్ ఎస్.ఎం.డి   యూనుస్ , ఇంటింటి ఓటరు సర్వే ను విజయవంతంగా నిర్వహిస్తున్న  ఇంజనీరింగ్ అసిస్టెంట్ జనార్దన్ నాయుడు లను  అభినందించారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్ సెంటర్  ,ఆర్బికే కేంద్రం ను పరిశీలించిన ఆయన గ్రామ సర్పంచి రవి యాదవ్ పనితీరుపై  ప్రశంసలు కురిపిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అయన వెంట ఎంపీడీఓ శోభారాణి, తహశీల్దార్ పుల్లయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ కిషోర్, టీపీఓ బాల మద్దయ్య, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, మండల విద్యా శాఖ అధికారి ఫైజున్నిసా బేగం, మండల సర్వేర్ మాణిక్యం, సీఐ విజయ భాస్కర్, మున్సిపల్ డీఈ నాయబ్ రసూల్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

About Author