మాదిగలను ఓటు అడిగే హక్కు సుధీర్ ధార కు లేదు
1 min readడాక్టర్ సుధీర్ ధారా నందికొట్కూరు మాదిగ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
మాలల నియోజకవర్గముగా నందికొట్కూరును పేర్కొనడంపై భగ్గుమన్న దళిత సంఘాల నాయకులు.
వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థ లేక మాల సంఘం నాయకుడా..?
మాదిగ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే ఎన్నికల ప్రచారం అడ్డుకుంటాం.
సిద్ధార్థ రెడ్డి సమక్షంలోని వ్యాఖ్యలు చేయడం బాధాకరం.
దళిత సంఘాల నాయకులు స్వాములు, పగడం రాఘవయ్య, డాక్టర్ రాజు, బీఎస్పీ నాయకులు లాజర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. సుధీర్ ధారా కు మాదిగల ఓటు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు , బీఎస్పీ నందికొట్కూరు ఇంచార్జి గద్దల లాజర్ అన్నారు. నందికొట్కూరు పట్టణంలోనే కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో గత సోమవారం నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళన సదస్సులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధారా నందికొట్కూరు నియోజకవర్గం మాల నియోజకవర్గము అంటూ చేసిన వివాహస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దళిత సంఘాల నాయకులు జిల్లా కన్వీనర్ స్వాములు మాదిగ, పగడం రాఘవయ్య, విజ్జి మాదిగ, డాక్టర్ రాజు మాదిగల బీఎస్పీ నాయకులు లాజర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్లో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు పగడం రాఘవయ్య, డాక్టర్ రాజు, విజ్జి మాదిగ, జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు ,బీఎస్పీ నందికొట్కూరు ఇంచార్జి గద్దల లాజర్ మాట్లాడుతూ మాలల ఆత్మీయ సమావేశంలో వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుదీర్ ధారా నందికొట్కూరును మాలల నియోజకవర్గం గా పేర్కొనడం అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటూ మాల సోదరుల మెప్పుదల కోసం ఎస్సీలలో ఇతర కులాలను తక్కువచేసి, నందికొట్కూరు ప్రజలను అవమానించడము తగదని వారు హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరూ ఏనాడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని , కానీ కొత్తగా కడప నుండి వచ్చిన డాక్టర్ సుధీర్ దార దళితుల్లో చిచ్చు పెట్టేందుకే కుల సంఘానికి నాయకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నందికొట్కూరు నియోజవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ, ఓసి,ముస్లిం మైనారిటీ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న ప్రాంతం నందికొట్కూరు అన్నారు. ఎన్నడు ఏ నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గం కుల నియోజవర్గంగా పేర్కొనలేదని, కుల పిచ్చితో, ఇతర కులాలను కించపరిచే విధంగా కేవలం నందికొట్కూరులో మాలలు మాత్రమే ఉన్నారని పేర్కొనడం సబబు కాదని దుయ్యబట్టారు. అవివేకిగా అజ్ఞానంతో మాట్లాడిన మాటలను నందికొట్కూరు ప్రజలు ఎవరు క్షమించరని తక్షణమే నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అదే మాటలకు కట్టుబడి కేవలం మాల సోదరుల వీధుల్లో మాత్రమే తిరిగి ప్రచారం చేసుకొని ఏ వర్గాల ప్రజల మద్దతు కోరుకొండ గెలిచే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రజా నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలోనే డాక్టర్ సుధీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన మౌనం వహించడము సరికాదన్నారు.అన్ని వర్గాల ప్రజలతోపాటుగా మాదిగ ప్రజలు ఉపకులాల ప్రజలు కూడా సిద్ధార్థ రెడ్డిని అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో మాదిగ కాలనీలలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు , బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.