దక్షిణాదిలో ఎక్కువగా ఉబకాయంతో బాధపడుతున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : దక్షిణాది రాష్ట్రాలలో పురుషుల కంటే మహిళలే ఊబకాయం సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారని తాజా నివేదిక తెలిపింది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ వ్యత్యాసం కాస్త తక్కువగా ఉంది. హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ చేసిన అధ్యయనంలో తెలంగాణలోని 31 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలోనే అత్యధికంగా కన్యాకుమారి జిల్లాలో 53 శాతం మంది మహిళలు ఊబకాయంతో ఉంటే, రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. జాతీయ స్థాయిలో కూడా మహిళలే ఎక్కువగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 24% మహిళలు, 22.9% పురుషులు ఊబకాయంతో ఉన్నారు.