అప్రమత్తతో..‘షుగర్’కంట్రోల్
1 min readడా.ఎస్.వి. చంద్రశేఖర్ , జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలాజిస్ట్, సి ఈ ఒ
- ‘జెమ్కేర్ ’లో ప్రపంచ మధుమేహ దినోత్సవం..
- 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు
పల్లెవెలుగు:కర్నూల్ నగరం కొత్త బస్టాండ్ సమీపంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా షుగర్ వ్యాధిపట్ల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ వి చంద్రశేఖర్ (జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలాజిస్ట్, సి ఈ ఒ) మాట్లాడుతూ షుగర్ బారినపడినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి వివరించారు. షుగర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, ఆహారపు అలవాట్ల, వ్యాయామం గురించి తెలిపారు.ఈ సందర్భంగా జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న ఉచిత షుగర్ పరీక్ష క్యాంపును గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి రాఘవేంద్ర (కార్డియాలజిస్ట్), డాక్టర్ జివిఎస్ రవిబాబు (ఆర్థోపెడిషియన్) డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ (జనరల్ సర్జన్), డాక్టర్ రామ్మోహన్ రెడ్డి (ఎమర్జెన్సీ హెచ్ ఓ డి)లు మాట్లాడుతూ ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు ఉచిత వైద్య సౌకర్యాన్ని వినియోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రూ 2500 గల డయాబెటిక్ చెకప్ ను రూ 899 లకే చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ ప్యాకేజిని వినియోగించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్(సి ఒ ఒ), రమణ బాబు (మార్కెటింగ్ హెచ్ ఒ డి), హెచ్ఒడి లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.