NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యానికి ఆర్థిక సహాయం అందచేసిన సుగవాసి ప్రసాద్ బాబు

1 min read

– మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి మదీనా మస్జీద్ అంబులెన్స్ డ్రైవర్ సమీ పీలేరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వేలూరు CMC ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. సమీ వైద్యపు ఖర్చుల కోసం మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు సమీ తండ్రి S కరిముల్లా గారికి ఆర్థిక సహాయం అందచేశారు. సమీ ఆరోగ్య పరిస్థితులపై వారి తండ్రి కరీముల్లా గారిని అడిగి తెలుసుకున్నారు.అలాగే అంబులెన్స్ లో చికిత్స కోసం వెళుతున్న పేషెంట్ సహయకురాలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గులాబ్ జాన్ వైద్యపు ఖర్చుల కోసం వారి మరిది ఆరిఫుల్లా గారికి సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆర్థిక సహాయం అందజేశారు, ఈకార్యక్రమంలో జిల్లా టీడీపీ మైనారిటీ నాయకులు మయాన ఇర్శాద్ ఖాన్ గారు పాల్గొన్నారు.

About Author