ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృత్యువాత
1 min readపల్లెవెలుగువెబ్: ఆఫ్ఘనిస్థాన్ మరోమారు రక్తసిక్తమైంది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఏకంగా 100 మందిని పొట్టనపెట్టుకున్నారు. రాజధాని కాబూల్‌లోని ఓ విద్యాకేంద్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 100 మంది మృత్యువాత పడినట్టు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది హజారాలు, షియాలేనని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో హజరాస్‌ది మూడో అతిపెద్ద కమ్యూనిటీ. దస్త్-ఇ-బార్చి ప్రాంతంలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. స్థానిక జర్నలిస్టు బిలాల్ సర్వారీ ఈ బాంబు పేలుడుపై ట్వీట్ చేస్తూ.. తాము ఇప్పటి వరకు 100 మంది విద్యార్థుల మృతదేహాలను లెక్కించినట్టు పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు.