కలెక్టర్ చాంబర్ లో ఆత్మహత్యాయత్నం !
1 min read
పల్లెవెలుగు వెబ్ :తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి కలెక్టరేట్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుడిగే మహేష్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. మహేష్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాక లో 20 ఏళ్ల కిందట నాలుగు ఎకరాల భూమిని 6 వేలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు పట్టాదారు పుస్తకం ఇవ్వకపోవడంతో మహేష్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాధితుడితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.