PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కాంచ‌న‌-3’ న‌టి సూసైడ్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ‘కాంచ‌న‌-3’ సినిమాలో కీలక‌పాత్ర పోషించిన నటి అలెగ్జాండ్రా జావి ఆత్మహ‌త్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఆమె గోవాలోని త‌న నివాసంలో ఆత్మహ‌త్యకు పాల్పడింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌త కొన్నిరోజుల క్రిత‌మే ఆమె త‌న ప్రియుడితో విడిపోయారు. ఈ కార‌ణంగానే మ‌న‌స్థాపానికి గురై ఆత్మహ‌త్య చేసుకుని ఉండ‌వ‌చ్చని స్థానికులు భావిస్తున్నారు. ఆలెగ్జాండ్రా జావి మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలెగ్జాండ్రాది ర‌ష్యా. మోడ‌ల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో న‌టించడానికి ఆమె భార‌త్ వ‌చ్చారు. గ‌త కొంత కాలంగా గోవాలో నివాసం ఉంటున్నారు. గ‌తంలో చెన్నైకి చెందిన ఓ ఫోటోగ్రాఫ‌ర్ లైంగికంగా వేధించాడ‌ని అలెగ్జాండ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అత‌న్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కోణంలో కూడ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author