PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కెసిఆర్ నిర్ణయం దేశానికి గర్వకారణమన్న సుఖదేవ్ థోరట్

1 min read

– తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును జాతీయ మేధావులు అభినందన
– వేలానికి అంబేద్కర్ గ్రంథం ” ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ” 1 కోటి ప్రారంభ బిడ్డింగ్‌
– హాజరైన వైస్ ఛాన్సలర్లు : ఏప్రిల్ 4న రవీంద్రభారతిలో ప్రబుద్ధ భారత్
– ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరమ్ తరుపున కె.
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్​ : చంద్రశేఖర్ రావును కొనియాడుతూ అధికారులు, ప్రముఖులు ,బుద్ధిజీవులు, మహిళలు కృతజ్ఞతా సభ జరిపినారు. తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టడంతోపాటు భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు నిర్ణయాన్ని తీర్మానం ద్వారా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించారు.సమతా సైనిక్ దళ్ వాలంటీర్లు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను పాటిస్తాననిప్రమాణం చేసి అనంతరం జెండా ఎగురవడంతో వేడుక ప్రారంభమైంది. అనంతరంవాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కీర్తిస్తూపాటలు పాడారు.ముఖ్య అతిథి, UGC మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ సుఖదేవ్ థోరట్ మాట్లాడుతూ, “ఈకృతజ్ఞతా కార్యక్రమంలో భాగమైనందుకు నేను గర్విస్తున్నాను. సచివాలయానికినామకరణం చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకుతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును అభినందిస్తున్నాను.ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘గతంలో ఏ ముఖ్యమంత్రులుచేయని గొప్ప పనిని మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్నందుకుగర్విస్తున్నాను. నేను అతని నిర్ణయాన్ని అభినందిస్తున్నాను.”ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఒకే భాష, ఒకే రాష్ట్రంమన బాబా సాహెబ్ అంబేద్కర్ కల అని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోపేర్కొన్న ఆదర్శాలను అమలు చేయడం ద్వారా మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ అసాధ్యమైన కలను సాకారం చేశారని అన్నారు.మాజీ చీఫ్ సెక్రటరీ కె. మాధవరావు మాట్లాడుతూ “సమాజంలో మనకు వ్యక్తిగతంగా,భౌతికంగా, భౌగోళికంగా అనేక గుర్తింపులు ఉన్నాయి. మానవుల యొక్క అన్నిప్రధాన విలువలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి తన జీవితాన్ని త్యాగంచేసిన మన గొప్ప దార్శనికుడు భారత్ సాహెబ్ అంబేద్కర్. మన ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు ఖచ్చితంగా సరైన పని చేస్తున్నారు.గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & టెక్నాలజీ వ్యవస్థాపకుడు ఢిల్లీ వసంత్మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి తన నిర్ణయంతో ఒక మేధోపరమైన భావ విప్లవాన్ని సృష్టించి నట్టు తెలిపాడు. ప్రపంచ మేధావి గా గుర్తింపు పొందిన అంబేద్కర్ను ప్రపంచానికి ఆయన అందించిన ఆర్థిక పరిజ్ఞానాన్ని మరోసారి పరిచయం చేయాలని సంకల్పించాడు. పాశ్చాత్య ప్రపంచంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్షసిద్ధాంతానికి ప్రసిద్ధి చెందినట్లే, బాబా సాహెద్ అంబేద్కర్ రచించిన “ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ” గ్రంథం ఆధునిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. ఏరియా ఆఫ్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతాన్ని అక్కడి మేధావులు వేలం పాట పాడినట్టు మనం కూడా ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ గ్రంథాన్ని వేలం పాట పాడదామని సూచించాడు. ఈ నిర్ణయానికి అనుకూలంగాశామీర్‌పేటలోని సెయింట్ పాల్స్ విద్యాసంస్థల చైర్మెన్ సురేష్ బెంజమిన్ రూ.కోటి ప్రారంభ బీడ్ గా తన చెక్కునుసురేష్ బెంజమిన్ అందించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ వేలం పాటను ఆరు నెలలుగా కొనసాగిస్తూ ప్రపంచంలో నీ వివిధ దేశాధినేతల ను, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేద్దామని సూచించాడు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రారంభోపన్యాసం చేయగా పద్మశ్రీ నర్ర రవికుమార్ అధ్యక్షత వహించారు. కన్వీనర్లుగా బి శ్యామ్, దాసరి శ్యామ్ మనోహర్ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైస్ ఛాన్సలర్లు మరియు ఇతర అతిథులు ఈ కార్యక్రమ నిర్వహణలో ఢిల్లీ వసంత్ చేసిన విశేష కృషిని ప్రస్తావించారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహిళా, అంబేద్కర్, పాలమూరు మరియు ఇతర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లు పాల్గొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నల్గొండ తదితర జిల్లాల నుంచి ఈ సభకు హాజరయ్యారు. అదేవిధంగా వివిధ యూనివర్సిటీల మరియు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు హాజరయ్యారు.

About Author