సుమంత్ వివాహం.. అక్కినేని కుటుంబంలో శుభకార్యం
1 min readపల్లెవెలుగు వెబ్ : హీరో సుమంత్ వివాహం నిశ్చయమైంది. అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కుటుంబంతో వియ్యం అందబోతున్నారు. సుమంత్, పవిత్రల పవిత్ర బంధం త్వరలో ప్రారంభమవుతుంది. ఇరు కుటుంబ సభ్యలు, పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ మేరకు సుమంత్-పవిత్రలకు సంబంధించిన పెళ్లిపత్రిక నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అక్కినేని కుటంబంలో ఈ శుభకార్యంతో పండుగ వాతావరణం నెలకొంది. గతంలో కీర్తి రెడ్డి తో హీరో సుమంత్ కు వివాహం అయింది. అనంతరం ఇరువురూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.