పెదపాడు శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు
1 min read
ఇంజనీర్,డాక్టర్, రచయితలుగా భవిష్యత్తులో ఎదగాలి
కథలు,ఇండోర్ గేమ్స్, క్యారమ్స్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలు
పర్యవేక్షించిన గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జానుబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం విద్యార్థిని విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్”ప్రఖ్యాత భారతీయ తెలుగు శాస్త్రజ్ఞులు-ఇంజనీర్లు” సర్. సి.వి రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి విపులంగా తెలియపర చారు, భవిష్యత్తులో మిరు శాస్త్రజ్ఞులు ,ఇంజనీర్లు అవ్వాలని నిశ్చయం కావా లని ఆకాంక్షిస్తూ,లక్ష్యం ఉండాలి, ఓర్పు కావాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సరైన మార్గం ఆలోచించాలి అన్నారు, ఇంకా పరిశోధనా దృక్పథం ముఖ్యంగా ఉంటే ఎవరైనా శాస్త్రజ్ఞులు-ఇంజనీర్లు అవ్వచ్చని తెలియజేశారు. అనంతరం నారం శెట్టి ఉమామహేశ్వరరావు రచించిన”నిజమైన స్నేహితుడు”అనే పుస్తకం నుండి”కనువిప్పు”అనే నీతి కథను రీసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్ కుమార్ విద్యార్థులచే చదివించడం పుస్తకపట్టణం చేయించడం జరిగినది. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించి వారితో కలిసి గ్రంథాలయ ఆవరణలో గడ్డి పీకి వేసి శుభ్రపరచడమైనది. ఆటవిడుపులో భాగంగా బాలబాలికలకు ఇండోర్ గేమ్స్ “చెస్,క్యారమ్స్” ఆటలు నేర్పించి ఆడించడం జరిగినది. ఈ కార్యక్రమం నకు 25 మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది. పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు మంచినీరు, స్నాక్స్ పంచ్ పెట్టడం జరిగినదని తెలియజేశారు.
