పెదపాడు శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరలు ప్రారంభం
1 min read
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు
పెదపాడు ఎంఈఓ డివి రమణ
పర్యవేక్షించిన గ్రంథాలయ అధికారి దుగ్గుపోగు జాన్ బాబు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు శాఖ గ్రంధాలయంలో సోమవారం వేసవి విజ్ఞాన శిబిరాలు ఆసక్తికరంగా ప్రారంభము అయ్యాయి. ఈ కార్యక్రమంలో పెదపాడు ఎం.ఈ.ఓ డి.వి రమణ పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు వీటిని ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరారు. ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండి జరగబోవు కార్యక్రమములు అన్నింటిలో పాల్గొని మంచి విజ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు. ఎం.ఈ.ఓ స్వయంగా పిల్లలతో “చెస్”ఆటను ఆడి, ఆటలో మెలకువలను వారికి వివరించినారు. తదుపరి కథలు చెప్పడం, కథలు చదివించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ స్కూల్ హెచ్.ఎం వేల్పుల ప్రభాకర్, శ్రీకృష్ణ గురుకులం కరస్పాండెంట్, హెచ్.ఎం ,ఉపాధ్యాయులు భీమవరపు వంశీ మోహన్, రామాల బెంజిమెన్, శేటికం వెంకటేశ్వరరావు, జీ.వి ఆంజనేయులు పాల్గొని చిన్నారులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో 33 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనినారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణ ఆధ్వర్యంలో జరిగినది. పాల్గొనిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి స్వీట్లు పంచరు.