దుర్గ భోగేశ్వరుడుని తాకిన సూర్యకిరణాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం నాడు స్వామివారికి ఉదయం 6:45 నుండి 7 గంటల ఐదు నిమిషాల వరకు సూర్యకిరణాలు తాకి కిరణాభిషేకం జరిగింది. ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య రెండు వారాలపాటు స్వామివారికి సూర్యకిరణాలు తాకుతాయని ఉత్తరాయాణానికి ముందు 15 రోజులపాటు స్వామివారికి సూర్యకిరణాలు తాకుతూ ఉత్తరాయాణంలోకి ప్రవేశిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. స్వామివారికి మహన్య రుద్రాభిషేకము ,ధూప దీప నైవేద్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు పంచ కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి కల్పించారు.