అందనంత ఎత్తులో సన్ ఫ్లవర్ ఆయిల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : సన్ ప్లవర్ ఆయిల్ రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముడి సన్‌ఫ్లవర్ ఆయి ల్ ధర టన్నుకు సుమారు రూ.1,63,400కు చేరింది. ఏప్రిల్ నెల అవసరాల కోసం భారత కంపెనీలు రష్యా నుంచి ఇదే ధరకు 45వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దిగుమతి సుంకం, రిఫైనింగ్ ఖర్చులు, జీఎ్‌సటీ, ఇతర ఖర్చు లు కూడా కలిపితే కంపెనీలకు టన్ను ధర రూ.2 లక్షలు దాటిపోతుందని అంచనా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ట న్నుకు సుమారు రూ.1.23 లక్షలు ఉండేది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. ఉక్రెయిన్ నుంచి భారత్‌కు రావాల్సిన 3లక్షల టన్నులకు పైగా సన్‌ఫ్లవర్ ఆ యిల్ ఆ దేశంలోని నౌకాశ్రయాల వద్ద నిలిచిపోయింది. దీంతో రష్యా మా ర్కెట్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర చుక్కలనంటుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అర్జెంటీనా నుంచి దిగుమతులను పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.