NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ వివేక హ‌త్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. పులివెందుల‌కు చెందిన సునీల్ కుమార్ యాద‌వ్ ను గోవాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈమేర‌కు సీబీఐ కేంద్ర కార్యాల‌యం సునీల్ అరెస్టును ధృవీక‌రించింది. గోవాలో సోమవారం అరెస్టు చేసి అనంత‌రం స్థానిక కోర్టులో సీబీఐ అధికారులు హాజ‌రుప‌రిచారు. గోవా స్థానిక కోర్టు ద్వార సునీల్ యాద‌వ్ ను ట్రాన్సిట్ రిమాండ్ లో క‌డ‌ప‌కు తీసుకొచ్చారు. వివేక హ‌త్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ యాద‌వ్ ను ఇప్పటికే సీబీఐ అధికారులు ప‌లుమార్లు విచారించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది.

About Author