PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13న జే అగ్రహారంలో సుంకులమ్మ అవ్వ దేవర ఉత్సవాలు        

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని జే. అగ్రహారం గ్రామంలో వెలసిన సుంకులమ్మ అవ్వ దేవత ఉత్సవాలు మంగళవారం నుండి జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సుంకులమ్మ అవ్వ దేవత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహిస్తామని పూజారులు తెలిపారు. అలాగే బుధవారం నాడు ఉదయం 6 గంటల  నుండి సుంకులమ్మ దేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవత మూర్తికి బోనాలు అర్పిస్తారని  సుంకులమ్మ దేవత దేవర ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలల నుండి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివస్తారని, గ్రామంలో భక్తాదులకు సరిపడా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. తమ గ్రామ సుంకులమ్మ దేవత దేవర ఉత్సవాలకు తరలిరావాలని వారికి ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. 

About Author