PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాల్ టికెట్ పై సన్నిలియోన్ ఫోటో

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటక లో ఇటీవల జరిగిన టెట్ పరీక్ష సందర్భంగా వింత ఘటన జరిగింది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అభ్యర్థిని హాల్ టికెట్ పై బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో ఉండడమే దీనికి కారణం. ఈ నెల 9న కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్ 2022) జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. శివమొగ్గలోని రుద్రప్ప కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని హాల్ టికెట్ పై ఇన్విజిలేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ హాల్ టికెట్ లో అభ్యర్థి ఫొటో ఉండాల్సిన చోట సన్నీలియోన్ ఫొటో ఉండడంతో లోపలికి అనుమతించలేదు. కాలేజ్ ప్రిన్సిపాల్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో పరీక్షకు అనుమతించారు. కాగా, ఈ వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందనేది కనిపెట్టి, అందుకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

About Author