సూపర్ సైక్లోన్ పుకారు మాత్రమే !
1 min readపల్లెవెలుగువెబ్: బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారనుందని కథనాలు రావడం తెలిసిందే. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం వట్టి పుకారు మాత్రమేనని ఐఎండీ స్పష్టం చేసింది. ఆ తుపానుకు ‘సిత్రాంగ్’ అని నామకరణం చేసినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని పేర్కొంది. దీనిపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర స్పందించారు. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని, అది భారత తీరాన్ని తాకుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సూపర్ సైక్లోన్ కు సంబంధించి తాము ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించారు.