NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అద్భుతమైన ప్రదర్శనలతో సూపర్ జోడి రెండో ఎపిసోడ్

1 min read

– ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు, మీ జీ తెలుగులో!

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఛానల్గా రాణిస్తున్న జీ తెలుగు ప్రారంభించిన సరికొత్త నాన్ఫిక్షన్ షో సూపర్ జోడీ. సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షోగా ఘనంగా లాంచ్ చేసిన ఈ షో మొదటి మెగా లాంచ్ ఎపిసోడ్ అభిమానులను ఎంతగానో అలరించింది. మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రెండో ఎపిసోడ్ తో సూపర్ జోడీ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి ఆదివారం అదిరిపోయే ఎపిసోడ్లతో అలరించేందుకు సిద్ధమవుతున్న సూపర్ జోడీ రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 04న, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో మాత్రమే!గత ఆదివారం ప్రసారమైన సూపర్ జోడీ మొదటి ఎపిసోడ్ నవ్వులు, భావోద్వేగాలు, అదిరిపోయే ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. ఫిబ్రవరి 4న రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న రెండో ఎపిసోడ్ తో జీ తెలుగు ప్రేక్షకులను మరింత ఉర్రూతలూగించనుంది. మొదటి ఎపిసోడ్ లాగే రెండో ఎపిసోడ్ కూడా ప్రతిభ, అందం, వినోదం సమ్మేళనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.ఈ సెలబ్రిటీ డాన్స్ షో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి బుల్లితెరపై సంచలనంగా మారింది. ఎవరీన్ యాంకర్ ఉదయ భాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి అందాల తారలు మీనా, శ్రీదేవి విజయ్ కుమార్తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. వినోదభరితంగా సాగిన మొదటి ఎపిసోడ్లో నలుగురు డైనమిక్ సెలబ్రిటీ జోడీలు మేఘన – మహేష్, శ్రీ సత్య- సంకేత్, మున్నా-హర్షల మరియు కరమ్ డాలీ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ జోడీల ఆకట్టుకునే ప్రదర్శనలు సూపర్ జోడీ షో రానున్న ఎపిసోడ్లకి ప్రతీకగా నిలిచాయి.ఇక, ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్ లో భాగంగా సూపర్ జోడీ గ్రాండ్ లాంచ్కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై మరింత గ్లామర్ జోడించారు. ఈ ఎపిసోడ్ కొనసాగింపుగా ప్రసారం కానున్న రెండో ఎపిసోడ్లో మరో నాలుగు సెలబ్రిటీ జోడీలైన తనూజ-కృష్ణ, పింకీ-శివ, అంజనా- సంతోష్, దిలీప్-యష్మి ఆకట్టుకునే ప్రదర్శనలతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ భాగం కానున్న సూపర్ జోడీ రెండో ఎపిసోడ్ని చూసేందుకు మీరూ సిద్ధంకండి!

About Author