సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించాలని నియోజకవర్గం అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై. నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈసందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని ఎస్సి కాలనీలో తెలుగుదేశం బాబు స్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో సుబ్బారెడ్డి, వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి వ్యక్తి పై రెండు లక్షల వరకు ఆదనపు భారం పడింది. ఆ భారం మనకు తెలియకుండా వివిధ పన్నుల రూపాలలో, ధరలను పెంచి మన దగ్గర నుండే వసూలు చేస్తున్నారు. కావున ప్రజలందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రకటించిన మేనిఫెస్టోను సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించాలి. వాటిలో భాగంగా 18-59 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.1500/- బ్యాంకు అకౌంట్ జమ, తల్లికి వందనం పథకం క్రింద ప్రతి బిడ్డతల్లికి రూ.15,000/- ఆర్థిక సాయం, దీపం పథకం క్రింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితం, 1వ తరగతి నుండి % దీవఎష్ట% వరుకు ఉచిత విద్య,రైతు సోదరులకు ఏడాదికి రూ. 20,000/- ఆర్ధిక సాయం, యువగళం పథకం క్రింద నిరుద్యోగ యువతి, యువకులకు నెలకు రూ.3,000/- నిరుద్యోగ భృతి. ప్రతి ఇంటికి ఉచిత నల్లా( మంచినీరు), మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం,బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం, రానున్న ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు, పూర్ టూ రిచ్ పథకం లాంటి ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పించే పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ప్రజాక్షేత్రంలోని ఈ వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలి. ఈ కార్యక్రమంలో డోన్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి, మాజీ ఎంపీపీ ఆర్ ఈ రాఘవేంద్ర, రామ్మోహన్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి,గడ్డం అంకి రెడ్డి,రామసుబ్బయ్య, చిన్న సుంకయ్య, పెద్ద రామాంజనేయులు, మధు, ప్రిన్సిపాల్ మధు, చల్ల వీరాంజనేయులు, సుధాకర్ గుప్తా, కమలాకర్,కొండపై, బ్యాంక్ శ్రీ ను,ప్యాపిలి పట్టణం బూత్ కన్వీనర్లు మెంబర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.