సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్.. మహేష్ ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు సమాధానంగా తన మనసులో మాట వెల్లడించారు. ‘నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. ‘‘కొన్ని సినిమాలు కొందరే చేయాలి. ‘మేజర్’లో అమరవీరుడు సందీప్‌గా శేష్ బాగా సూటయ్యాడు. సందీప్ పాత్ర నేను చేసుంటే బాగుండేదేమోనని ఆలోచించే అంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి. మిగతా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు హీరో, నిర్మాత మహేశ్‌బాబు.