PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉపాధి’పనులను పర్యవేక్షించండి:పిడి రామచంద్రారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి బుధవారం నాడు పిడి రామచంద్రారెడ్డి పరిశీలించారు గడిగరేవుల గ్రామంలో హార్టికల్చర్ కింద మొక్కలను నాటిన రైతులతో మాట్లాడారు బూజునూరు గ్రామంలో చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి బిలకల గూడూరు గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్డుకి ఇరువైపులా నాటిన చెట్లను పరిశీలించారు అనంతరం ఉపాధి హామీ సిబ్బందితో పిడి రామచంద్రారెడ్డి ఎంపీడీవో విజయ్ సింహరెడ్డి సమావేశమై ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవక్షించాలని రోజువారి కార్యకలాపాలను యాప్ లో నమోదు చేయాలని చనిపోయిన ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను  తొలగించాలని ఆదేశించారు ఏప్రిల్ నుండి మార్చి వరకు ఇచ్చే లేబర్ బడ్జెట్ ను  పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటరమణ. ఈసీ సునీల్ గవాస్కర్. టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author