NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే…

1 min read

కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్

-స్థానిక 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ భాష

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని గుమ్మజ్ దర్గా నందు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్  మరియు స్థానిక 10 వ వార్డ్ కార్పొరేటర్ యూనిస్ భాష. కర్నూలు ఎమ్మెల్యే దృష్టికి దర్గాలో నీటి ఇబ్బంది ఉందని మసీద్ సంఘం సభ్యులు తెలియజేయగా కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మాట్లాడి బోర్ ఏర్పాట్లు చేయించారని కార్పొరేటర్ యూనిస్ భాష తెలిపారు. అనంతరం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ళుగా ఏ ప్రభుత్వం కూడా గుమ్మజ్ ను పట్టించుకోలేదని ఇప్పుడు బోర్ వేయించడమే కాకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మరియు జనవరి 26న జరుపుకునే కార్యక్రమాలకు కొండారెడ్డి బురుజు ఎలాగైతే లైటింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. గో గ్రీన్ లో భాగంగా గుమ్మాజ్ లో పచ్చదనం పరిశుభ్రత 2 ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమం వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author