NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాశివరాత్రి సందర్భంగా భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈనెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గడిగరవుల గ్రామ సమీపంలో ఉన్న శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం భద్రత ఏర్పాట్లను బుధవారం నాడు నంద్యాల జిల్లా డిఎస్పి మహేశ్వర్ రెడ్డి సిఐ వెంకటేశ్వరరావు. పరిశీలించి ఆలయ చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఎస్సై వెంకటసుబ్బయ్యకు.. వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు పార్కింగ్ ఏర్పాట్లపై పలు సలహాలు సూచనలు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని పికెట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు ఈ సందర్భంగా దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

About Author