PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు ఉత్పత్తిదారులకు నాణ్యత గల  యంత్రాలను సరఫరా చేయండి

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాణ్యతతో కూడిన యంత్రాలను సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య హాజరైన కంపెనీల ప్రతినిధులకు సూచించారు.శనివారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సరఫరా చేసే ప్రొసెస్సింగ్ మరియు నూర్పిడి యంత్రాల ధర నిర్ణయాలపై (DPMC) డిస్ట్రిక్ట్ ప్రైస్ మానేటరింగ్ కమిటీ లో వివిధ కంపెనీల యాజమాన్యాలతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య  కంపెనీ వారు  ఇచ్చిన ధరల పై సమీక్ష నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ కార్యక్రమంలో భాగంగా వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకము  2022-23 క్రింద ఆంధ్ర ప్రదేశ్ కరువు నివారణ ప్రాజెక్ట్  లో కర్నూలు జిల్లాలోని  18 మండలములలో ఏర్పాటు చేసిన 18 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు  రూ. 52 లక్షల సబ్సిడీతో (26 ప్రాసెసింగ్ యూనిట్లు) యూనిట్ ఒక్కటికి సబ్సిడీ రూ. 2.00 లక్షలకు మించకుండా (50% రాయితీతో) పధకము చేపట్టడం జరుగుతుందన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాణ్యతతో కూడిన చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె  గింజల పంటలకు అవసరమైన ప్రొసెస్సింగ్ మరియు నూర్పిడి యంత్రాలను సరఫరా చేయాలని హాజరైన కంపెనీదారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు యంత్రాలు సరఫరా చేయుటకు సుజయ్ ఆగ్రో ఇండస్ట్రీస్, ప్రకాష్ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ ట్రేడర్స్, ప్రకాష్ ఎంటర్ ప్రైజెస్, సాయి వరుణ్ ఇండస్ట్రీస్ అను ఐదు కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. నూర్పిడి యంత్రాల ధర నిర్ణయాలపై (DPMC) డిస్ట్రిక్ట్ ప్రైస్ మానేటరింగ్ కమిటీ వివిధ కంపెనీలయాజమాన్యాలతో మాట్లాడి ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి, హార్టికల్చర్ ఆఫీసర్ రామాంజనేయులు, ఆగ్రోస్ డి.ఎం, వ్యవసాయ శాఖ ఏడీలు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author