రైతుల పురోభివృద్ధికి డీసీసీబీ ద్వారా తోడ్పాటు..
1 min read– మహాజన సభలో డీసీసీబీ చైర్ పర్సన్ పి.వి.ఎల్ నరసింహరాజు వెల్లడి..
– రుణాలు నూరు శాతం వసూలు చేసిన అధ్యక్ష , కార్యదర్శులకు మెమౌంట్ తో సత్కారం..
– ముఖ్యమంత్రి జగన్ రైతులకు పెద్దపీట..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గత 105 సంవత్సరాలుగా రైతుల సేవకు అంకితమై 48 మండలాల పరిధిలో ఉన్న 34 శాఖల ద్వారా 259 ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, 376 ఇతర సంఘాల ద్వారా జిల్లా రైతాంగానికి, బడుగు బలహీన వర్గాల వారికి ఋణ సహాయం అందజేస్తూ వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సభ్యులకు యితోధిక సేవలందిస్తూ జిల్లా పురోభివృద్ధికి తోడ్పాటు అందజేస్తున్నట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్ పర్సన్ పీవీఎల్ నరసింహరాజు తెలియజేశారు. ది జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సాధారణ మహాజనసభను శనివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి అవసరాలకు పెద్దపీట వేశారని అన్నారు. ఈసందర్భంగా అజెండాలోని అంశాలను, 2022-23 సంవత్సరానికి జారిచేయబడిన ఆడిట్ నివేదిక, ఆడిట్ చేయబడిన బ్యాంకు లాభనసష్టములు, ఆస్తి అప్పుల పట్టికలు, ఆడిట్ సర్టిఫికేట్ ను ఆమోదించారు.ప్రస్తావన సంవత్సరంలో బ్యాంకు రూ. 1,24,799.27 లక్షలు మేర స్వల్పకాలిక రుణాలు మంజూరు చేశామని దీనిలో రూ.41320.27 లక్షలు మేర జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్వంత నిధుల నుండి సమీకరించి, క్షేత్ర స్థాయిలోని పరపతి అవసరాలకు ఆప్కాబ్ ఆర్ధిక సహాయానికి మధ్య అంతరాన్ని పూరిస్తూ బ్యాంకు ఆప్కాబ్ పరిమితులకు లోబడి రుణాలు మంజూరు చేసి ప్రాధమిక వ్యవసాయ సంఘాల ద్వారా రైతాంగానికి ఆర్ధిక చేయూత అందజేసామని తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడి ఋణాలు క్రింద సంఘాల ద్వారా రైతులకు రూ.37317.78 లక్షలు అందజేసామన్నారు. బ్యాంకు పురోభివృద్ధికి మూలస్థంభంగా నిలిచిన రైతు సభ్యులకు, ఖాతాదారులకు నరసింహరాజు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పురోభివృద్ధికి దోహదపడుతున్న ప్రాధమిక వ్యవసాయ, వ్యవసాయేతర సహకార పరపతి సంఘాల ఛైర్ పర్సన్లు, పిఐసి సభ్యులను అభినం దించారు. ఈసందర్భంగా ముఖ్య కార్యనిర్వహణా ధికారి డా బి. శ్రీదేవి బ్యాంకుకు అవసరమైన ఆర్ధిక సహాయం సకాలంలో అందజేయుటలో అన్ని విధాలుగా సహకరిస్తున్న రిజర్వు బ్యాంకు, నాబార్డు వారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యాంకుకు సహాయ సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బ్యాంకులో బకాయిపడ్డ అప్పులను వసూలుచేయుటలో సహకరించుచున్న డిప్యూటీ రిజిష్ట్రార్ కు బ్యాంకు ఆడిట్ పూర్తి చేసిన స్టాట్యుటరీ ఆడిటర్స్ కి, బ్యాంకు పురోభివృద్ధికి అనుక్షణం కృషి సలిపి బ్యాంకునకు ప్రత్యేక స్థానము కల్పించుటలో తోడ్పడిన బ్యాంకు సిబ్బందిని, సంఘాల సిబ్బందిని అభినందించారు. అనంతరం నూటికి నూరు శాతం రుణాల రికవరీ చేసిన సొసైటీ చైర్ పర్సన్ లను, కార్యదర్సులకు మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈకార్యక్రమంలోఉమ్మడి జిల్లాలోని సొసైటీ చైర్ పర్సన్ లు, కార్యదర్సులు, డీసీసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.