NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజ్ఞులైన మేధావులు మద్దతు ఇవ్వండి ఇండియా కూటమి అభ్యర్థి

1 min read

న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విజ్ఞులైన మేధావులు .సిపిఎం. కాంగ్రెస్( ఇండియా కూటమి) బలపరుస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల తో  ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసే వారిని శాసనసభకు పంపాలని ఆయన కోరారు. జిల్లాలో వెనుకబడ్డ పత్తికొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కై భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి చేయటంలో గతంలో గెలిచిన పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని నియోజవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాలవ నుండి చెరువులకు నీళ్లు మళ్లించి ఉంటే ఈరోజు గ్రామాల్లో త్రాగునీరు కొరత  ఉండేది కాదని స్పష్టం చేశారు. అలాగే హంద్రీనీవా నీటిని పంట పొలాలకు మళ్ళిస్తే పంటలు పండి తద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. ఈ సమస్యలపై చట్టసభలో గట్టిగా ప్రశ్నించడానికి ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి.రామచంద్రయ్య కంకి కొడవలి  గుర్తుపై మరియు కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాని అభ్యర్థించారు.

About Author