వైస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు దూదేకుల సంఘం నాయకుల మద్దతు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు, పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న, బీ వై. రామయ్య, కర్నూలు యం యల్ ఏ, గా పోటీ చేస్తున్న Amd. ఇంతియాజ్ లకు, ఏపీ, నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతును తెలియ జేస్తున్నామని రాష్ట్ర సంఘం అధ్యక్షులు పీర్ అహమ్మద్ అన్నారు. సోమవారం, కర్నూలులోని వైస్సార్సీపీ MLA పార్టీ కార్యాలయంలో నెల్లూరు, గుంటూరు, జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర దూదేకుల సంఘం నాయకులు పీర్ అహమద్, రాష్ట్ర కార్యదర్శి సలీం, మహిళా స్టేట్ ప్రెసిడెంట్, డి. మస్తానమ్మ, వైస్ ప్రెసిడెంట్, డి. హుస్సేనమ్మలు కర్నూలు, నంద్యాల, దూదేకుల సంఘం, జిల్లా నాయకులు, గోకారి, నాగరాజులు,ఎంపీ, యం, యల్ ఏ, అభ్యర్థులను పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం కార్యాలయంలో దూదేకుల సంఘం నాయకులు కార్యకర్తలతో రాష్ట్ర నాయకులు పీర్ అహమ్మద్ మాట్లాడుతూ,మాట్లాడుతూ,వై ఎస్, జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దూదేకుల ఇంటి గడప, గడపకు, వెళ్ళాయని అన్నారు. ముఖ్య మంత్రి జగన్, sc, st, Bc, లకు,50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆయనది అన్నారు.రాష్ట్రంలో ఉర్దూ రెండవ బాషా గా చేసారన్నారు. వైస్సార్ షాదీ తోఫా, లాంటి పథకాలు,ముస్లిం మైనార్టీ లకు, ఇచ్చా రన్నారు.ఇంతియాజ్ గారు ఒక IAS, అధికారిగా పేద ప్రజల కోసం పని చేసారన్నారు.అయన గెలిస్తే కర్నూలు నగరం అభివృద్ధి జరుగుతుందని అన్నారు.జిల్లాలో దాదాపు 20,000 వేల ఓటర్లుగా దూదేకులు ఉన్నారని అన్నారు. మనం స్టార్ కంపెయినర్లు గా మారి,కర్నూలు నుండి Amd. ఇంతియాజ్ ను, MLA, గా, కర్నూలు MP, గా బి వై, రామయ్యను గెలిపించుకుందాం అని అన్నారు. ఈ సందర్బంగా ఇంతియాజ్, మాట్లాడుతూ, రాష్ట్ర, మరియు జిల్లా దూదేకుల సంఘం, నాయకుల మద్దతు లభించడం హర్షించ దగ్గ విషయమని, వారి సమస్యలను, పరిష్క రిస్తామని అన్నారు. Mp. అభ్యర్థి బీ వై. రామయ్య మాట్లాడుతూ, దేశంలోనే సామజిక విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. దూదేకుల సంఘం మద్దతు తమకు లభించడం సంతోషించ దగ్గ విషయమని, వారి సమస్యలను, పరిష్కారం చేస్తామని అన్నారు.కార్యక్రమంలో దూదేకుల సంగం, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.