NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్దతు ధరతో.. ధాన్యం కొనుగోలు

1 min read
ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏడీఏ నరసింహారెడ్డి

ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏడీఏ నరసింహారెడ్డి

– ఏడీఏ నరసింహారెడ్డి
పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: రైతులు పండించిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఏడీఏ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో రైతు భరోసా కేంద్రాల ద్వారా పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసింది. గ్రామానికి చెందిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీకాంత్ రెడ్డి కి సంబంధించిన 94 . 4 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని పౌరసరఫరాల సహకారంతో డీసీఎంఎస్ వారు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతులు తమ భూమిలో ఏయే పంటలు వేసుకుంటున్నారు, ఆ పంటలకు సంబంధించిన విషయాలను రైతు భరోసా కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. అందుకు పట్టాదారు పాస్​ పుస్తకం, ఆధార్​ కార్డు, బ్యాంకు ఖాతా తీసుకెళ్లి వ్యవసాయ సలహా సభ్యులను కలవాలన్నారు. పంట కొనుగోలు సమయంలో పంట తేమశాతాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఈ సందర్భంగా మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి తెలియజేశారు.

About Author