NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యమ నాయకులను ఆదరించండి

1 min read

– ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు
పల్లెవెలుగు, వెబ్ పత్తికొండ: రానున్న శాసనమండలి ఎన్నికలలో ఉద్యమ నాయకులను ఆదరించాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పట్టణంలోని స్టేట్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, తాసిల్దార్ కార్యాలయం వ్యవసాయ కార్యాలయం ఆర్డిఓ ఆఫీస్ ట్రెజరీ కార్యాలయం మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పట్టభద్రులను కలుసుకొని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు నవంబర్ 7వ తేదీ లోపు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే వారిని ఎన్నుకుందామని పిలుపునిచ్చారు.పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గా కత్తి నరసింహారెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్.రామాంజనేయులు, మండల సహాయ కార్యదర్శి రంగన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ ఏఐఎస్ఎఫ్ తాలూకా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author