గొర్రెల కాపరి రమేష్ ను ఆదుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గొర్రెల మందపై ఊర కుక్కలు దాడి తో 60 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనం గడుపుతున్న కే .రమేష్ ఉపాధి కోల్పోయాడని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంకే .కే .రంగస్వామి , కోశాధికారి కే .సి .నాగన్న, నగర సహాయ కార్యదర్శి కే .దివాకర్ , ఓర్వకల్ మండలం అధ్యక్షులు కే .అల్లబాబు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాహ్మణపల్లెలో రమేష్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .ఈ సందర్బంగా 60 గొర్రెలు నష్టపోయిన రమేష్ ను ప్రభుత్వం ఆడుకోవాలని డిమాండ్ చేశారు .రాత్రి వేళ గొర్రెలు ఆపుకోవడానికి ప్రభుత్వ భూమి కేటాయించి , చుట్టూ కంచె ఏర్పాటు చేసి గొర్రెల కాపరులను ఆదుకోవలెనని జిల్లా కలెక్టర్ ను కోరుచున్నామన్నారు. కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు అల్లస్వామి, సుంకన్న పాల్గొన్నారు.