వడ్డెర ఎస్టీ సాధన మహా పాదయాత్రకు ( ABOSS) మద్దతు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వడ్డెర ఎస్టీ సాధన కొరకు తిరుపతి జిల్లా అలిపిరి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి విజయవాడ కనకదుర్గమ్మ వరకు మహా పాదయాత్ర కొనసాగిస్తున్న వడ్డెర అమర్నాథ్కి మరియు వారి బృందానికి ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం నుండి పాదయాత్ర ముగింపు కార్యక్రమమానికి ఉమ్మడి కర్నూల్, నంద్యాల జిల్లా అఖిల భారత ఒడ్డె ఓబ్బన్న సేవాసమితి( ABOSS) మద్దతు తెలిపారు.నంద్యాల జిల్లా అధ్యక్షులు వడ్డె బీవీయన్ రాజు మాట్లాడతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా వెనకబడి మారుమూల ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నాము.అప్పటి ప్రభుత్వాలు వడ్డెర్లను క్రిమినల్ ట్రైబ్స్ గా గుర్తించి క్రిమినల్ ట్రైబ్స్ లో ఉన్న యానాది, ఎరుకుల మొదలైన కులాలను1952 లో st లో చేర్చారు వడ్డెర్లను బీసీ ఏ లో కలిపారు .అన్ని బీసీ కులాల కంటే అత్యంత వెనుకబడి విద్య, రాజకీయ, ఆర్థికంగా,రిజర్వేషన్లు లేక నష్టపోయారు. కొన్ని రాష్ట్రాలలో వడ్డెర్లు ఎస్టీ జాబితా లో ఉన్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీలుగా గుర్తించబడ్డారు. గత కొన్ని ప్రభుత్వాలు కమిటీ లు వేసి, హామీలు ఇచ్చిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల పార్టీలను మేము ఒక్కటే వేడుకుంటున్నాం మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నామని, ఎస్టి లో చేర్చటమే అన్నిటికి సమాధానం అని జనరల్ సెక్రటరీ వడ్డె చిన్న అన్నారు. ఈ కార్యక్రమంలో ABOSS జనరల్ సెక్రెటరీ పలుకురు శివకృష్ణ, నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు శివమణి,టౌన్ ప్రెసిడెంట్ వడ్డె కేతన సురేష్, సీనియర్ వడ్డెర నాయకులు వడ్డె నడిపి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.