టి.జి భరత్‌కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సమీప బంధువు ఉమర్ ఆలీఖాన్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్‌కు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సమీప బంధువు ఉమర్ ఆలీఖాన్ సంపూర్ణ మద్దతు తెలిపారు. మౌర్య ఇన్‌లోని టి.జి భరత్ కార్యాలయంలో ఉమర్ ఆలీఖాన్ తన బృందంతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉమర్ ఆలీఖాన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టి.జి భరత్‌కు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. టి.జి భరత్ గెలుపు కోసం తాను, తన బృందం కష్టపడతామన్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 6 గ్యారెంటీలను ఐదేళ్లలో అమలు చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంతో మంది యువతీ, యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. తన ఆరు గ్యారెంటీలు ఐదేళ్లలో చేయని పక్షంలో 2029 ఎన్నికల్లో పోటీయే చేయనన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. మొదటిసారి ఓటు వేసే వారంతా మంచి వ్యక్తినైన తనకు ఓటు వేసి గెలిపించాలని టి.జి భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు రాంబో, తదితరులు పాల్గొన్నారు.