గాలి జనార్ధనరెడ్డి కేసు పై సుప్రీం ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసు విచారణకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. 12 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇప్పటిదాకా కోర్టులో ట్రయల్ జరగకపోవడం విచారకరమని కోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర అభియోగాలున్న ఇలాంటి కేసుల ట్రయల్‌లో జాప్యం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని కూడా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.