సోషల్ మీడియా పై సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జి ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో ప్రింట్ మీడియాకున్న జవాబుదారీతనం ఎలక్ట్రానిక్ మీడియాకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోషల్ మీడియా పరిస్థితి ఇంకా దారుణమని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన రాంచీలో నిర్వహించిన జస్టిస్ ఎస్.బి.సిన్హా స్మారకోపన్యాసంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత, పనితీరు దెబ్బ తింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త మీడియాకు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో చెప్పే సామర్థ్యం లేదన్నారు. ఈ మీడియా స్వయంగా విచారణలు నిర్వహించి, అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడానికి ఎంతో కష్టపడే అంశాలపై కూడా ఇట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నాయని మండిపడ్డారు.