PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి.. అశోక్ కుమార్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి.  పి.వి.రావు మలమహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అన్నారు. స్థానిక గాంధీనగర్ లో ధర్నా చౌక్ నందు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా, అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరుగు నిరసన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ    తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలనే కుట్రతో ఈరోజు తెలంగాణలో మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొనడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీం కోర్టు కొట్టివేసిన ఎస్సీవర్గీకరణపై మాట్లాడతారని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడడం చాలా దారుణం. అన్నారు. దేశ ప్రధాని అయ్యి ఉండి కేవలం తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడం కోసం ఎస్.సి.లో ఒక వర్గానికి కొమ్ముకాయడం అంటే మిగతా కులాలను విస్మరించడమేనని అశోక్ కుమార్ అన్నారు.అలాగే ఎస్.సి. వర్గీకరణ అంశంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రధాని మాట్లాడితే తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు..అలాగే ఎస్.సి వర్గీకరణపై ఇతర రాజకీయ పార్టీలవారు కూడా తన స్పష్టమైన వైఖరిని తెలపాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎస్.సి. వర్గీకరణకు మద్దతిచ్చే ఏ రాజకీయ పార్టీల వారినైనా భూస్థాపితం చేస్తామని, అన్నారు. ఎస్.సి వర్గీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా త్వరలో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు  పెయ్యల పరశురాముడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మల్ల నరసింహరావు, తెలంగాణరాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం స్వరూపారాణి, కృష్ణాజిల్లా అధ్యక్షులు పంతగాని సురేష్, సామా బాబురావు, నాతి శ్రీనివాసరావు, పోతుల నాగరాజు, జల్లి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా కన్వీనర్ మారెళ్ళ సోమరాజు, మూలే మేఘరాజు, ఎం.వి.వి. సత్యనారాయణ, బి. రామకృష్ణ, కొంగు నూకరాజు, జక్కల ప్రసాద్ బాబు, మాత అప్పారావు, వారా జార్జి రాజు, మాతా అబ్బులు, మాతా బాలకృష్ణ, ఇజ్జిన కాటమరాజు, ఇజ్జిన చలపతిరావు, వేళంగి వెంకటేష్, రోకళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author