PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబును అక్రమ కేసులతో వేధించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలి

1 min read

– న్యాయం ఒకవైపు.. అన్యాయం మరోవైపు అంటూ టగ్ ఆఫ్ వార్ కార్యక్రమం చేపట్టిన నేతలు

– ఇద్దరు రాజులు తలుచుకుంటేనే చంద్రబాబు బయటకు వస్తారు.. టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులతో వేధించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా న్యాయం ఒకవైపు.. అన్యాయం మరోవైపు ఫ్లెక్సీలు కట్టుకొని టగ్ ఆఫ్ వార్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టి.జి భరత్ తో పాటు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నేతలు పాల్గొన్నారు. నేతలంతా న్యాయం, అన్యాయం ఫ్లెక్సీలు తాడుకు కట్టుకొని లాగుతూ నిరసన తెలిపారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో క్వాష్ పిటిషన్ ద్వారా న్యాయం జరిగినప్పటికీ రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రజల్లో ఉండకుండా అన్యాయంగా చాలా కేసులు పెట్టి జైలులో పెట్టొచ్చన్నారు. అందుకే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వేధించకుండా.. ఆయనకు ఉపశమనం ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలన్నారు. రాజుల యుగంలాంటి నేటి పరిస్థితుల్లో ఇద్దరు రాజులు తలుచుకుంటేనే ఏమైనా జరుగుతుందన్నారు. రాష్ట్రం, కేంద్రంలో ఉన్న రాజులు అనుకున్నప్పుడే చంద్రబాబు బయటకు వస్తారన్నారు. అనంతరం సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు విషయంలో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. ప్రజలంతా చంద్రబాబువైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగరాజు యాదవ్, పరమేశ్, సోమిశెట్టి నవీన్, జూటూరు రవి, అబ్బాస్, సత్రం రామక్రిష్ణుడు, గున్నామార్క్, తిమ్మోజీ, రాజ్ కుమార్, సుంకన్న, రామాంజనేయులు, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

About Author