బుల్డోజర్ రాజకీయాల పై సుప్రీం కీలక వ్యాఖ్యలు !
1 min readపల్లెవెలుగువెబ్ : యూపీలో బుల్డోజర్ రాజకీయాల పై అత్యున్నత న్యాయ స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్‌తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. తాము కేవలం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పగలమని తెలిపింది. జామియా ఉలేమా ఈ హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత చట్ట ప్రకారం జరగాలని, ప్రతీకార ధోరణి ఉండకూడదని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పందించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రయాగ్‌రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలకు నోటీసులు ఇచ్చింది.